27, డిసెంబర్ 2010, సోమవారం

poem of Annavaram Devender గుట్ట ... పచ్చ నోట్ల కట్ట

గుట్ట

 

             పచ్చ నోట్ల కట్ట

సుట్టూ పదూర్ల పెట్టు
కండ్ల సలువ ఆ గుట్ట
అరొక్క జీవరాసులు కలె తిరిగే మైదానం
రేగుపరికి బల్సుకు తునికి
పండ్లెన్ని తిన్నా దంగని తీపి
సొరికెలు దోనెలు సొరంగాలు
బండ మీద నిలబడ్డ మహాబండ
నీళ్ల తావుల కాడ గోదల కాళ్ల ముద్రలు
ఎక్కంగ దిగంగ బాటొంటి కన్పించే గురుతులు
కల్మశం కలవని గుండం నీళ్లు
ఏండ్లకేండ్లు ఆవిరి కాని సెలయేర్లు

సుట్టూ పదూర్ల పెట్టు
అందరికీ కండ్ల సొగసు ఆ కనికట్టు

గుట్టంటే- మద్ది పాలకొడిశె ఏప జిలుగు జిట్రేగు
మర్రి మోత్కుల్లు మొలిసి పెరిగిన రాళ్లవనం
గుట్ట ఒక పెద్ద పురా జాడ
గుట్ట సజీవ సౌందర్యవనం
గుట్ట పుట్టుక వెయ్యిల గుట్టల ఏండ్లు
సకల ప్రాణుల పసందైన లోకం
గుట్ట నిండా గుబురుగా పెరిగిన
ముండ్ల చెట్లు పండ్ల చెట్లు మందు చెట్లు
మొగులు నిండా తిరిగే
పూరేల్లు గొర్రెంకలు కొంగలు బుర్కపిట్టలు
గుట్టానందం ఎక్కినోల్లకే తెలుస్తది
ఎక్కినకొద్దీ మొగులును ముద్దిచ్చుకున్నట్టు
కిందికి చూస్తే
చింతాకంత మడికట్లు వరిపొలాలు
అగ్గిపెట్టెల ఇండ్లు దారంపోసల దారులు
నువ్వు గింజలై నడుస్తున్న ఆవుల మందలు

దీన్ని నిగురాన్‌గ చూస్తే
మంచి సుతారి మజుబూత్‌గ కట్టినట్లే అన్పిస్తది
గుట్ట మీది వాన నీళ్లు
సుట్టూ కాలువలు కాలువలుగ పారి
చెర్లు కుంటల దూప తీర్చే ధారలు
గుట్ట సుట్టువార మైలు దూరం దాకా
పొలాలన్నీ జాలు నీళ్ల కాలువలు
బాయిలు బందాలన్నీ కొప్పురం కొప్పురం

పక్కపొన్న గుట్టుంటే
ఊరందరికీ గుట్టంత గుండె ధైర్యం

తాతల కాలం నుంచీ గంభీరంగున్న గుట్టతల్లి
ఇయ్యాల గజగజ వణుకతంది
గుట్ట పచ్చ నోట్ల కట్టైంది
వానికి గుట్ట నిండా పైసలే కన్పిస్తున్నాయి
గుట్ట తల్లిని కైమకైమ కంకర చేస్తున్రు
మెరిసే గ్రైనేట్ రాళ్ల గుట్టలన్నీ
సముద్రం ఆవలి దేశాలకు అమ్ముతున్రు
బొమ్మల గుట్టమీది జినవల్లభుని కందపద్యం
పదకొండు వందల ఏండ్ల శాసన చరిత్ర
కన్నడ ఆదికవి పంపని కాలపు శిల్పం
ఆనాడు గుట్టలే కావ్యాల కాన్వాసులు
అన్ని గుట్టలనూ గులాబ్‌జామూన్‌లా తింటండ్రు
కురిక్యాల పోరండ్ల ఒడ్యారం అన్నారం
నందగిరికోట్ల నేర్జాపురం నెమల్లగుట్ట
అన్నిటినీ దోస వక్కలోలె కోస్తండ్రు

సకల జీవరాసులకు పెట్టనికోట- గుట్ట
అది ఎచ్చ పచ్చని నీడ పర్యావరణ జాడ

- అన్నవరం దేవేందర్
94407 63479
(కరీంనగర్ జిల్లాలో 560 గుట్టలను గ్రైనేట్ క్వారీలకు అనుమతిచ్చిండ్రని తెలిసి..)
published in Andhrajyothi daily vivida page 27/12/2010

21, డిసెంబర్ 2010, మంగళవారం

ముస్లిం బహుజన తెలంగాణా పండుగ




పీరీల పండుగ ముస్లిం బహుజన తెలంగాణా పల్లె సంస్కృతికి అద్దం వంటిది . అస్సోయ్ దూల ఆట ఎగురుకుంట ఆ మంటల ఆలవా సుట్టు తిరుగుతంటే మస్తు సంబురం .నేను మా తమ్ముడు శ్రీనివాస్ తో కలిసి  ఈ పండుక్కు కొండాపూర్, పోతారం ల పాల్గొన్నం .చాలా రోజుల తరువాత పీరీల పండుగల పాల్గొన్నం .అక్కడ మదార్ సాబ్ .లస్మయ్య ,గడ్డం వెంకటరాజం పాడిన ఆశన్న ఉషన్నపాటలు బహు పసందుగా పాడిన్డ్రు.పాత పాటలే కాదు కొత్తగా తెలంగాణా కోరికను కలుపుకుంట కై కట్టిండ్రు. ఈ పండుగ లో ముస్లిం దూదేకుల ,కాష తురుక ఇతర చేతి వృతుల వ్యవసాయ   కులాల స్త్రీ పురుషులు అంతా పాల్గొన్నారు. కొండాపూర్ వూల్లె మస్తు జరిగింది. దీన్ని డాక్యుమెంటరి తీద్దామని అంత రికార్డ్ చేసినం..

9, డిసెంబర్ 2010, గురువారం

నలిమెల భాస్కర్ నలుగు పదుల సాహిత్యఉత్సవం


 నలిమెల భాస్కర్ నలుగు పదుల సాహిత్యఉత్సవం  మరియు అయిదు పుస్తకాల ఆవిష్కరణ సభ ,హైదరాబాద్ 

13, నవంబర్ 2010, శనివారం

తొలి కంద పద్య శాసన స్థలంబొమ్మలమ్మ గుట్ట దగ్గర తెలంగాణా కవిత 2009 ,కావడి కుండలు కవిత సంకలనాల ఆవిష్కరణ




కరీంనగర్ సాహితి సోపతి,ఆలగడప తెలంగాణా మట్టి మనుషులు కలిసి నవంబర్ 7 న కరీంనగర్ దగ్గర కురిక్యాల లోని తొలి కంద పద్య శాసన స్థలం దగ్గర తెలంగాణా కవిత 2009 , కావడి కుండలు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించింది. క్రీ.శ.946 లో జినవల్లబుడు  రాసిన త్రి భాష శాసనం అక్కడ వుంది .జిన్నవల్లబుడు కన్నడ ఆదికవి పంపని సోదరుడు. విశాదమైన సందర్భం ఏందంటే ఆ శాసనము,జైనుల ప్రతిమలు ఉన్న ఆ బొమ్మలమ్మ గుట్టను ఘనత వహించిన( మన ) ప్రభుత్వం గ్రైనేటు వ్యాపారులకు అమ్మే ప్రయత్నం చేస్తంది.దీనికి వ్యతిరేకంగా ఆందోళన మొదలైంది. అందుకే వేనేపల్లి పాండురంగ రావు నేను సుంకర రమేష్ నలిమెల భాస్కర్ అక్కడ కవులు రచయితలతో పుస్తక ఆవిష్కరణ  యాత్ర ఈర్పాటు చేసినం. మలయ శ్రీ, జూకంటి జగన్నాధం నాళేశ్వరం శంకరం వి. ఆర్ .శర్మ ఇంకా కరీంనగర్ హైదరాబాద్ కామారెడ్డి హుస్నాబాద్ నుంచి స్థానిక  ఉద్యమ కారులు ఉప్పు లింగయ్య సర్పంచ్ రాజిరెడ్డి  ఇంకా సాహితి సోపతిగల్లు పాల్గొన్నారు.తెలంగాణా ప్రాచీన చరిత్ర వనరులను ద్వంసం ను అందరు ఖండించాలే...

25, సెప్టెంబర్ 2010, శనివారం

నలిమెల భాస్కర్ కు ఇండియన్ హైకు క్లబ్ ఉత్తమ నానీ పురస్కారం .అనకాపల్లి లో ....

నలిమెల భాస్కర్ కు ఇండియన్ హైకు క్లబ్ ఉత్తమ నానీ పురస్కారం .అనకాపల్లి లో ....

శ్రీకాకుళం కథానిలయం లో తెలంగాణా కవులు..

విజయనగరం లో గురజాడ ఇంటి ముందు ...

అరసవెల్లి సూర్య దేవాలయం లో

17, సెప్టెంబర్ 2010, శుక్రవారం

విద్రొహానికి విత్తనం సెప్టెంబర్ 17

నవంబర్ 1కు సెప్టెంబర్ 17 తల్లిలాంటిదే , మొదటిది తెలంగాణకు కటిక చీకటి రోజు అది 1956 ది. దీనిని కన్న తల్లే సెప్టెంబర్ 17 ,1948. హైదరాబాద్ ఒక స్వతంత్ర దేశాన్ని భారత దేశం దాడి చేసి కలుపుకున్నది. దీని వల్ల మాకేమి వచ్చింది .అప్పుడే పరాయి వాళ్ళం అయిపోయాము . అతరువాత తెలిసిందే అన్ద్రోల్లు తెలుగు తెలుగు అని తెగులు పట్టిచిండ్రు. భారత్ లో కలిపిన జాతీయత నే మాకు అన్ద్రోల్లకు పొత్తు పెట్టిచ్చింది .అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణాను నిట్ట నిలువు ముంచింది. అందుకే సెప్టెంబర్ 17 విద్రోహానికి ఇత్తునం పడ్డ రోజు.

13, సెప్టెంబర్ 2010, సోమవారం

సీమాంద్ర కవుల తెలంగాణా సంఘీభావం

తెలంగాణా ఉద్యమానికి సీమాంధ్రకవి మిత్రుల సంఘీభావానికి స్వాగతం .దోపిడీ,పీడన,ఆధిపత్యం ,ఎక్కడుంటే అక్కడ తన కలాన్ని కవి ఎక్కుపెడుతడు.కవికి ప్రాంతీయ బేదాలు ఉండవని నిరూపించారు చాలా మంది "కావడి కుండలు"కవితా సంకలనం ద్వార .వారందరికీ తెలంగాణా ప్రజల పక్షాన కృతజ్ఞతలు .ఈ పుస్తకానికి సంపదకం వహించిన కోయి కోటేశ్వర్ కు అభినందనలు. ఆంధ్ర ప్రదేశ్ ఆవిర్భావం నుంచి ఆంద్ర సామ్రాజ్య అగ్ర కుల దోపిడీ వలస వాదులు తెలంగాణాను సర్వ నాశనం చేసిండ్రు.నీళ్ళు,బొగ్గు,ఉద్యోగాలు,భూములు అన్నీ దోచుకున్న సంగతి అందరికి తెలుసు. మా భాష .సంస్కృతి కూడా పరీయికరణం చెందింది.అమెరిక లో రెడ్ ఇండియన్స్ లాగా ఇక్కడి పరిస్థితి ఉంది. ఈ స్థితిని అర్థం చేసికున్న సీమంద్ర కవులకు శనార్తి.

8, ఆగస్టు 2010, ఆదివారం

అవును... తెలంగాణా వొక దేశమే ......

సేమంద్ర మంత్రులకేమేరుక తెలంగాణా ఒక దేశం గానే వుండేది ఆతరువాత రాష్ట్రం అయ్యిందని .పందొమ్మిది వందల నలబై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు కు ముందు హైదరాబాద్ ఒక దేశం .దీనికి ఐక్య రాజ్య సమితి లో సబ్యత్వం కూడా వుండేది. ఆ తరువాత జవహర్ లాల్ నెహ్రు, పటేల్ ల వల్ల ఇండియన్ యునియన్ ల కలిసింది.ఈ దేశానికి రాయబార కార్యాలయాలు రక్షణ ,విమాన ,రవాణా,ఆర్ధిక, వ్యవస్థలు స్వతంత్రంగా ఉండేవి. అయితే ఇది ప్రజాస్వామికమైన పరిపాలన కాదు. ఫ్యూడల్ దొరలూ, పటేండ్లు రాజ్యం అండ తో ప్రజలను పీడించే వాళ్ళు.తరువాత హైదరాబాద్ రాష్ట్రం అయ్యింది. ఆంధ్ర భాష ప్రయుక్త కుట్రలకు బలి అయి పందొమ్మిది వందల యాబై ఆరు నవంబర్ వొకటి న ఆంధ్రప్రదేశ్ అయ్యింది. ఇది షరతులతో కూడిన కలయిక అప్పటినుంచి యాబై నాలుగేళ్ళ దోపిడీ పీడన పాలన నడస్తండి.ఇదివరుకున్న రాష్ట్రం కావల్నంటే ద్రోహం దేశ ద్రోహం అని మంత్రులే ఏకసేక్కేం చేస్తుండ్రు. అయితే ఇక నుంచి ఇదివరకున్నమా దేశమే కావాలనే డిమాండు చేస్తే వస్తే ఎట్లా ఎవలకు ఎరుక ?

3, ఆగస్టు 2010, మంగళవారం

బంతి పూల దండ

బలమైన విశ్వాసాన్ని నమ్మి దేని కైనా తెగించే తనం తెలంగాణా బిడ్డలది .మాయ మర్మం లేని ,వ్యక్తిగత అభివృద్ధి కోరుకొని ,వ్యాపార దృక్పథం లేనిదే తెలంగాణా మట్టి తత్వం .అందుకే ఇక్కడి బిడ్డలు కాలి పోతన్నారు .కడుపుల దుక్కం కుమ్మరిచి పోతాండ్రు .అమెరికా కలలు గన్న ఇషాన్ ఎట్లా దీపం వత్తి లాగా కాల్చుకొని బూడిదయ్యిండు.నిజానికి ఇషాన్ రెడ్డి మైసమ్మ మొక్కు తప్పు మొక్కుకున్నాడు .ఇంకో తీరు మొక్కనుండే. కొంత ఆవేదన కొంత సున్నిత మనస్తతత్వం కొంత ప్రతిక్రియత్మకత దృక్పథం కలే గలసి నేను అంటుకుంటే నన్న..... అనుకోని అమరుడై లోకాన్ని ఎడిపిచ్చిండు.ఈనాటి పిల్లలకు రేశం కోపం ఆవేశం ఉండాలే గని దాన్ని ఎక్కడ తీర్చుకోవల్నో అక్కడనే తీర్చుకోవలె .బిడ్డా ఇషాన్ నువ్వు తెలంగాణా సిగల బంతి పువ్వువు.

30, జులై 2010, శుక్రవారం

జయ జయ తెలంగానం

తెలంగాణా తెగతెంపులు చేసుకునే కొట్లాట.యాబై మూడేండ్ల నుంచి తెలంగాణా ప్రజలు అన్ని రకాల దోపిడీ కి గురయ్యారు .ఇది సమస్త తెలంగాణా ప్రజలకు పూర్తిగా అర్థం అయ్యింది .కానీ ఇక్కడి రాజకీయ నాయకులు ఆంధ్ర వలస వాదుల చెప్పు చేతల్లోనే ఉన్నారు .అందుకే ప్రజలు ఈ ఉప ఎన్నికల్లో భలే బుడ్డి జెప్పిండ్రు .తెలంగాణా ఉద్యమం లో రాజీనామా చేసిన వాళ్లనే మల్ల గెలిపిచిండ్రు. ఇది ఉద్యమ విజయమే .ముఖ్యంగా కాంగ్రెస్ తెలుగు పార్టీలు సిగ్గు పడాల్సిన సమయం .తెలంగాణా కొరకు ప్రణబ్ ముకర్జి కమిటి, శ్రీకృష్ణ కమిటి లు ఏసిన కాంగ్రెస్ పార్టినే ఆ కమిటిలకు రిపోర్ట్ ఇయ్యలేదు తెలుగు దేశం అంతే .ఇక తెలంగాణా మేమే తెస్తాం అని మాట్లాడిన మాటలన్నీ ఎతులని నమ్మి ఎవలకు వోటు వెయ్యలనో వాళ్ళకే పట్టం గట్టిండ్రు .ఇక రానున్న రోజుల్లో భారత రాజ్యాంగం ప్రజల ఆకాంక్షల ను నేరవేర్చేదిగా ఉందొ లేదో నిరుపించుకోవలె .తెలంగాణా వోటర్లకు ఉద్యమ శుభాకాంక్షలు

29, జులై 2010, గురువారం

వల్లుబండ వొక అనుభవం

రీంనగర్ జిల్లా తెలంగాణా ఉద్యమ కవితా సంకలనం తీసుక రావాలని ఆలోచనఅన్దిచింది మొట్ట మొదట అనిశెట్టి రజిత. మార్చ్ 21 2010 హనమకొండరాజరాజనరేంద్ర ఆంధ్ర భాషానిలయంలో 'తెలంగాణా జంగ్' ఉద్యమ కవితాసంకలనం విడుదల సభ జరిగింది. (నల్లెల్ల రాజయ్య సంపాదకుడు ) అదే రోజువరంగల్లు లో కవితా వార్షిక 2009 విడుదల సభకు పోయిన నేను సాయంత్రంతెలంగాణా జంగ్ లో పాల్గొన్న .అక్కడే ఉన్నరజిత మీ కరీంనగర్ నుంచి కుడా తీయలె సంకలనం అని ఎగిర పెట్టింది .సరే నని నేనుజూకంటి జగన్నాధం ,నలిమెల భాస్కర్ ఇంకా కొంత మంది మిత్రులం కల్సినిర్ణయానికి వచ్చినం .ప్రకటన ఇయ్యగానే మస్తు కవిత్వం వచ్చింది అన్ని వేయలనుకొని పైసల కోసంతిప్పల పడుతున్న క్రమం లో పది మంది మూడు వెయ్యిలు ఇచ్చేందుకు ముందుకు వచ్చిండ్రు .(వాళ్ళు వల్లుబండకు ప్రాణవాయువులు అయ్యిండ్రు . వాళ్ళు నలిమెల భాస్కర్ పాలిగ్లాట్ ,వానమాల చంద్రశేఖర్ రచయిత ,నగునూరి శేఖర్ జర్నలిస్ట్ ,అలుగోజు కుమార స్వామిముదుగంటి సుధాకర్ రెడ్డి సోషల్ వర్కర్ ,మల్యాల వరద శేషయ్య ,సంగెవేనిరవీంద్ర కవి ముంబై ,రాచెర్ల వెంకన్నతెలంగాణా వాది , తానిపర్తి తిరుపతి రావుతెలంగాణా వాది ,అన్నవరం రాజేశ్వరి టీచర్ .
ఇంకా ఏందరో వెలువడడానికి సహకరిచిండ్రు అందరికి వందనాలు.
పుస్తకం వెలువరించడం మంచి సంతృప్తినిచ్చిన అనుభవం

,



20, జూన్ 2010, ఆదివారం


వళ్ళుబండ
తెలంగాణా ఉద్యమ కరీంనగర్ కవిత సంకలనం ముద్రణకు సిద్దమైంది .కొన్ని కారణాల వల్ల లేటు అయ్యింది .ఇదివరకు చేసిన కవర్ పేజి సుత మార్చ బడ్డది .పది మంది మిత్రులు ఆర్ధిక సహాయం చేస్తే ఇది వస్తుంది .అన్ని అనుకున్నట్లే జరుగుతే జూలై ౧౦ లోపు విడుదల అవుతుంది .
ముఖ చిత్రం కు శ్రీనివాస్ బొమ్మ ఎస్తే గౌతం డిజైన్ చేసిండు

11, జూన్ 2010, శుక్రవారం

మానుకోట కవిత

పరాష్కం ..............అన్నవరం దేవేందర్

ఎప్పుడైనా ద్రోహి ఆవలి గడ్డ వాడే కావచ్చు
దోహద కారుడు మాత్రం
ఈ గడ్డ బిడ్డడే అయితండు

పట్టా పగలు గోడలకు పొక్కలు చేయ వాడొస్తే
సుత్తె సానం ఇంతోడే అందిస్తండు

చేతికి మన్ను అంటకుండా
ఎంగిలి మెతుకులు ఏరుకున్నోడు ఎత్తి పోస్తండు

యాత్ర ఈపేరుతోనైతేనేమి
తోటలు లూటి చేయడమే మిడతల పని

పలకరింపులు వేరు పరశికలు వేరు
పరమర్శకూ పద్దతులుంటాయి

సుట్టూ మంది తుపాకులు తూటాలు ఓ బి వ్యానులు
రువ్వడి కార్లు ఫ్లేక్సిలు కయ్య కయ్య జేజేలు

గిట్ల గిర గిర తిరుగుతె సుత
మండలిచ్చే తండుకేన బిడ్డ !

యాబై ముదేన్ల వోర్పు సల్లారి పోయింది
పానం వచ్చిన కంకర కదిలి పోయింది

@@@@@@@@@@@@@


7, జూన్ 2010, సోమవారం

28, మే 2010, శుక్రవారం

వల్లుబండ

వల్లుబండ తెలంగాణా ఉద్యమ కవితా సంకలనం పూర్తి అయ్యింది ౧౨౦ మంది కరీంనగర్ కవుల తో మంచి పుస్తకం వస్తుంది . ముందు ఈరగోల అని పేరు అనుకున్నాం కాని జూకంటి జగన్నాధం వల్లుబండ పేరు సుచిన్చిండు .వల్లుబండ అంటే దేవాలయాల్లో వాళ్ళు చెప్పే బండ కవిత్వానికి సింబాలిక్ ఉన్నది .కవర్ పేజి శ్రీనివాస్ ఆర్ట్ వేసిండు ఇంకో , రోజుల్లో ఫైనల్ అవుతుంది

17, మే 2010, సోమవారం

దీపం వత్తి

తెల్లారిందనుకున్న తెలంగాణ కల
మల్లా తెర్లు తెర్లైంది
యాబై మూడేన్ల చెర విముక్తి ప్రకటన
ఒక్క రోజన్నా నిలువలే

తినే ఇస్తరిల మన్ను వోసిడ్రు
కాళ్ళ సందుల కట్టెవెట్టిండ్రు
మంచి నీళ్ళ బాయిల మందు కలిపిండ్రు

అడుగు పెట్టిన నేల మూలుగును
దోసుక తిన మరిగిన వాళ్ళు
డిల్లి మాటలు పార్టి జెండాలు
పాతి పెట్టి కమ్మగా ఒక్కటైండ్రు

ప్రక్రియ మొదలైందన్న పలుకులకు
గట్టిగ తాళం బిగించి
చిదంబరాన్ని సంకలేసుకున్నారు
ఇగ శ్రీకృష్ణ లీలల ఆట రక్తి కడుతది







13, మే 2010, గురువారం

తెలంగాణా ఉద్యమం మీద కరీంనగర్ కవితా సంకలనం తెస్తామని నేను నలిమెల భాస్కర్ అనుకున్నాం .ఏప్రిల్ ౨౦ నుంచి ప్రకటన విడుదల చేసి ప్రయత్నాలు మొదలు పెట్టగానే ఇప్పటికే ౯౦ వరకు కవితలు వచ్చినై . నెలాకారి వరకు పుస్తకం వస్తది .. నారాయణ శర్మ ఎడిటింగ్ లో సహకరిస్తున్నాడు .
పుస్తకం పేరు ' ఈరగోల '.......................తెలంగాణా ఉద్యమ కరీంనగర్ కవిత్వం
నూరున్నోక్క గొంతుకల గానం