13, ఫిబ్రవరి 2014, గురువారం

చరిత్ర పురుషుడు జైశెట్టి రమణయ్య ఒక చరిత్ర

జైశెట్టి రమణయ్య ప్రఖ్యాత చరిత్ర కారుడు .చరిత్ర రచన పరిశోధన లో ఆయన కృషి ఎన్న తగినది .ఇటీవల జూకంటి జగన్నాధం ,నలిమెల భాస్కర్ ల తో కలిసి జగిత్యాల లో ఆయనను కలిసినప్పుడు కరీంనగర్ జిల్లాకు చెందిన చాలా చరిత్ర విషయాలు చెప్పిండ్రు .ఆయన రాసిన ’కరీంనగర్ జిల్లా చరిత్ర –సంస్కృతి ‘అనే పుస్తకం జిల్లా చరిత్రకు ఇప్పటికీ ప్రామాణికం .దీన్నే ఆంగ్లంలో వెలువరించారు .కాలగమనం కోన సముద్రం ‘మరొక చారిత్రక గ్రంధం దీనిని యస్ .జైకిషన్ తో కలిసి వేలువరించిడ్రు .Temples of south India ,The chalukya and kakatiya temples .వీరి మరో పుస్తకాలు .
                 జైశెట్టి రమణయ్య గారు చరిత్ర రచయితే కాదు తాను స్వయంగా చరిత్ర సృష్టించాడు .ఇప్పటికీ యాబైఏ డు సంవత్సరాలుగా డైరీ రాస్తున్నాడు .డైరీ అంటే స్వంత విషయాలే గాదు.ఆనాటి సామాజిక రాజకీయ విషయాలు అందులో ఉంటాయి .పందొమ్మిది వందల యాబై ఏడు నుంచి క్రమం తప్పని అలవాటు .ఇందుకు గాను ప్రపంచ రికార్డ్ లు ఎక్కి గుర్తింప పడ్డారు .అలాగే గత నాలుగు దశాబ్దాలకు పైగా వార్తా క్లిప్పింగులు సేకరించి పుస్తక రూపంలో ఉన్నాయి .తాను రాసిన ఉత్తరాలు ,తనకు వచ్చిన ఉత్తరాలు అతి ముక్యమైనవి పుస్తక రూపంలో బైండింగ్ చేసి ఉంచిండ్రు .Memories of Dr.J.Ramanaiah(autobiography),Prime pastures ,Glimpses ,A book of Invitations  ఇట్లా తన జీవితానికి తారస పడ్డయి అన్నీ తను భావి తరాల కోసం భద్రపరిచిండ్రు .
                       మొత్తం భారతదేశం ను చరిత్ర రచన అద్యయనం కోసం తిరిగిండ్రు .ఇక కరీంనగర్ జిల్లా ను చారిత్రక గ్రామాలను అన్నీ తిరిగి అక్కడి శాసనాలు చడువి విగ్రహాలను శోదించి ఏ కాలం ఏమిటి చరిత్ర అని రాసి ప్రకతిన్చిడ్రు .అట్లా గే కోటిలింగాల ఆంధ్రుల తొలి రాజధాని అని అక్కడ శాతవాహన పూర్వపు రాజ్యం ఉన్నదని గుర్తిన్చిండ్రు .చారత్ర నిర్మాణం లో రమణయ్య కృషి చాలా గొప్పది .ఆయన ఇల్లే ఒక మ్యుసియం లాగ ఉంటది .డెబ్బై ఆరేళ్ళ వయసున్న రమణయ్య సారు ను సూస్తే మనకు చరిత్ర రచన పట్ల ఉత్సాహం కలుగుతది.హిస్టరీ రీడర్ గా పందొమ్మిది వందల తొంబై ఆరు లో రిటైర్ అయిన ఆయన కు ఇప్పటికీ సాహిత్యం రచన చరిత్ర రచన అంటే ఇష్టమైన అంశాలు .వేల మంది శిష్యులు ఎందఱో ప్రముఖులు ఉన్నారు .

    జగిత్యాల అంటే జైత్ర యాత్రే కాదు ఇంకా అక్కడ యాదికి వచ్చేది అలిశెట్టి ప్రభాకర్ తిరిగిన అడుగుజాడలు .బి.ఎస్ .రాములు తాత్విక ఆలోచనలు ,మరియు జైశెట్టి రమణయ్య సారుతో చరిత్ర సంభాషణ .

9, ఫిబ్రవరి 2014, ఆదివారం

బహు భాషల నలిమెల భాస్కర్

ఆయనను   చూస్తే  అప్సస్ అనిపిస్తది .ఎట్ల నేర్సిండు ఇన్ని భాషలు అని .ఒకటా రెండా పద్నాలుగు భారతీయ భాషలు గడ గడ మాట్లాడుతాడు .సర్ర సర్ర రాసుకపోతడు .మల్లా ఇండ్ల కెల్లి అన్డ్లకు ,అండ్ల కెల్లి ఇండ్లకు సక్కగ అనువాదం చేస్తడు.మనకు తెలిసి ఏడు ఎనిమిది భాషలు తెలిసినోల్లు ఉన్నరు.పివి సాబ్ సుత భాహు భాషా కోవిదుడు .ఇంక ఆయనకు విదేశీ భాషలు సుత వచ్చు .ఈ పద్నాలుగు భాషలు నేర్సుకున్న నలిమెల భాస్కర్ ది కరీంనగర్ .ఆయన అన్ని భాషల పుస్తకాలు పత్రికలు ఉంటయి .
                              మొదట తమిళం నేర్సుకున్నాడట .ఇగ తరువాత కన్నడం ,మలయాళం ,హిందీ ,ఉర్దూ ,పంజాబీ ,సంస్కృతం ,అస్సామీ ,బెంగాలి ,ఒరియా ,మరాటి ,ఆంగ్లం ,గుజరాతీ ,ఇన్ని భాషలు వచ్చు తెలుగు భాష మనదేనాయే .మొత్తం పద్నాలుగు ఇంకోటి తెలంగాణా కూడా మస్తు వచ్చు .తెలంగాణ తెలుగు వేరు వేరా అనిపించవచ్చు .అవును వేరు వేరే అని ఈ నలిమెల భాస్కరే తన ‘బాణం ‘వ్యాసాల ద్వార నిరూపించిండ్రు .ఎందుకంటే తెలంగాణా భాషల రాసిన నవలలు కేవలం తెలుగు పుస్తకాలు సదివేవాల్లకు సమాజ్ కావు . అయితే ఇన్ని భాషల పట్ల ప్రేమ ఎందుకు పెరిగింది అంటే ,తాను రైల్వే స్టేషన్ ఉన్న ఒక వూరిలో ఉపాధ్యాయ ఉద్యోగం చేస్తుండగా ఆ రైల్వే బుక్ స్టాల్లో అన్ని భాషల చందమామ లు అన్ని భాషల రేపెదేక్స్ బుక్స్ చూసి పట్టు పట్టినట్టు చెప్పుతారు .ఇగ ఆ తెరువాత ఒక్కొకటి ఒక్కొక్కటి అన్ని భాషల అక్షరాలు సాహిత్యం వ్యాకరణం కథలు కవిత్వం అన్ని నమిలి మింగేసిండు .
            ఇట్లా అనువాదం లోకి వచ్చిండు గాని మొదలు ఆయన కవి రచయిత .1993 లో ‘నూరేల్ల పది ఉత్తమ మళయాళ కథలు ‘తెలుగులోకి అనువాదం చేసి పుస్తకం గా తెచ్చారు . ఇదే సంవత్సరం మలయాళం నుంచి ‘మనీమేకర్స్ ’నవల కన్నడం నుంఛి ‘కుండి ‘నవల తెలుగులోకి అనువదిన్చిండ్రు .  1996 లో ‘అద్దంలో గాందరి ‘ పేరుతో తమిళ మలయాళ మరాటి భాషలలోని పన్నెండు కథల పుస్తకం తెచ్చిండ్రు .1985 నుండి 2000 లలో తెలుగు లో వచ్చిన దళిత స్త్రీ వాద కవిత్వాన్ని తమిళంలో పుస్తకం వేసిండ్రు . 14 భారతీయ భాషలలలోని రచయితల పరిచయాన్ని ఆంధ్రజ్యోతి లో కాలం లో పరిచయం చేసి పుస్తకం గా వేసిండ్రు .ప్రజా సాహితీ లో ‘మట్టి కూడా మాట్లాడుతుంది ‘ కాలం రాసి పుస్తకం గా వేసిండ్రు .మలయాళ నవల ‘స్మారక శిలలు ‘అనువాదం అనువాదం సాహిత్య ఎకాడమి పుస్తకం గ వేసింది .ఇలా నలిమెల భాస్కర్ సర్ ఒక అనువాదాల ఖార్కనా .
                          ఇదంతా ఒక ఎత్తు తెలంగాణా భాషకు డిక్షనరీ తాయారు చేసుడు ఇంకొక ఎత్తు .ఆంద్ర –తెలంగాణా బలవంతంగ కలిపి ఆంధ్రప్రదేశ్ అనే తెలంగాణా భాషా సంస్కృతి చెప్పరానంత నష్ట పోయింది .అందులో తెలంగాణా పదాలు దాదాపుగా మరిచిపోయే దశ వచ్చింది .అప్పుడు ఆ లోటు ను తీర్చ ‘తెలంగాణా పదకోశం ‘తీసుకవచ్చిండ్రు .ఇప్పుడు మరిన్ని పదాలతో సరి కొత్తగా వస్తుంది.

                             అనువాదం లేకపోతే దేశ దేశాల కవిత్వం సాహిత్యం మనం చదువక పోవచ్చు కాని ఇదొక పరిశ్రమ .నలిమెల భాస్కర్ ఇన్ని భాషలు తెలిసి మన సాహిత్యాన్ని ఇతరులకు అక్కడి సాహిత్యాన్ని మనకు అందిస్తున్నారు .చిన్నగా భాషల మీద ఇంట్రస్ట్ బహుభాషా వేత్తను చేసింది .భాషల పట్ల ప్రేమ ఇన్ని భాషల మన భాస్కర్ గురించి అంతర్జాల పాట కులకు తెలువాలేనని  ఈ తొవ్వలో ఈ సారి భాస్కర్ .... 

16, మార్చి 2012, శుక్రవారం

ఆదిలాబాద యాది

ఆదిలాబాద యాది 

ఆయన తాన కాసేపు కుసుంటే 
వూడల మర్రి కింద ఉల్లాసంగా ఉన్నట్టు 
పారే గంగను సూసి బీరి పోయినట్టు 
ముచాట్లన్నీ 
గుట్టకు చెవు వొగ్గి వింటున్నట్టే ...

ఆయనతో ముచ్చట వెడితే 
హిందుస్తానీ సంగీతం విందు చేస్తది 
రుబాయి రుబాబ్ చూపిస్తడి
ఉర్దూ పర్షియన్ సాహిత్య పరిమళం 
రిమ్మ తో గమ్ము మంటది 

పొరలు పొరలు గా అయన జ్ఞాపకాలన్నీ 
గడ్డపారతో తవ్వుతుంటే 
కచ్రం కట్టుక పోయి ఎర్ర మన్ను లెక్క 
ఇంటికి తెచ్చు కోవలనించే పుస్తకాలే 

వినడం కోసమే 
విద్య నగర్ దాక పోయిరావలె 
చెవులు తెరిచి ఉంచితే చాలు 
ముచ్చట సంగీతమై కడుపు నిమ్పుద్ది 

ఆ ఇల్లు 
సుస్వర రాగ కచేరీల చరిత్ర 
అది వొక కమనీయ కావన వేదిక 
కమ్మని మతాల వాటిక 
ఆదిలాబాద అంటే అడవే కాదు 
అడవి వెన్నల ముచ్చట్ల యాది సదాశివ..  

18, నవంబర్ 2011, శుక్రవారం

బమ్మెర పోతన ,చాకలి ఐలమ్మ గ్రామాల సందర్శన

                       


ఈ రోజు( 17 నవంబర్ 2011 న) నేను పోతన పుట్టిన బమ్మెర ,చాకలి ఐలమ్మ పుట్టిన పాలకుర్తి గ్రామాలను సందర్శించిన .వరంగల్ జిల్లాలోని పాలకుర్తి మండలం లో ఉన్నాయ్ .పోతన మాత్యుని సమాధి ,ఆయన దున్నిన మడి,అయన మోట కొట్టిన బాయి అన్నీచుసిన .చాలా అద్వాన్నంగా నిర్లక్ష్యంగా ఉన్నాయి సంస్కృతి చరిత్ర పట్ల మన పాలకులకు గౌరవం లేదు ,అక్కడి పొలాన్ని ఇప్పటికి పోతన మడి అని పిలుస్తారు '
                                 బమ్మెర పక్క ఊరే పాలకుర్తి అక్కడ తెలంగాణా సాయుధ పోరాట యోధురాలు చాకలి (చిట్యాల)ఐలమ్మ మనుమడు రామచంద్రం  బాపమ్మ జ్ఞాపకాలను చాలా సేపు చెప్పిండు .ఐలమ్మ విగ్రహం చేయించామని ఆవిష్కరణకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పిండు .ఐలమ్మ మీద సినిమా తీస్తున్న విషయం కూడా చెప్పిండు