21, డిసెంబర్ 2010, మంగళవారం

ముస్లిం బహుజన తెలంగాణా పండుగ




పీరీల పండుగ ముస్లిం బహుజన తెలంగాణా పల్లె సంస్కృతికి అద్దం వంటిది . అస్సోయ్ దూల ఆట ఎగురుకుంట ఆ మంటల ఆలవా సుట్టు తిరుగుతంటే మస్తు సంబురం .నేను మా తమ్ముడు శ్రీనివాస్ తో కలిసి  ఈ పండుక్కు కొండాపూర్, పోతారం ల పాల్గొన్నం .చాలా రోజుల తరువాత పీరీల పండుగల పాల్గొన్నం .అక్కడ మదార్ సాబ్ .లస్మయ్య ,గడ్డం వెంకటరాజం పాడిన ఆశన్న ఉషన్నపాటలు బహు పసందుగా పాడిన్డ్రు.పాత పాటలే కాదు కొత్తగా తెలంగాణా కోరికను కలుపుకుంట కై కట్టిండ్రు. ఈ పండుగ లో ముస్లిం దూదేకుల ,కాష తురుక ఇతర చేతి వృతుల వ్యవసాయ   కులాల స్త్రీ పురుషులు అంతా పాల్గొన్నారు. కొండాపూర్ వూల్లె మస్తు జరిగింది. దీన్ని డాక్యుమెంటరి తీద్దామని అంత రికార్డ్ చేసినం..

2 కామెంట్‌లు:

  1. >> ఇతర చిల్లర కులాల
    మీరు ఎటువంటి అభిజాత్యం లేకుండా వాడినప్పటికీ, ఈ ప్రయోగం అభ్యంతరకరంగా ఉంది. పరిశీలించగలరు.

    రిప్లయితొలగించండి
  2. అస్సోయ్ దూల ఆడిదాం కొడుక ఆశన్న ఊశన్నలాల అంటూ రెడ్డి, కాపు గౌండ్ల, కమ్మరి, కుమ్మరి, సాకలి, మంగలి, మాల, మాదిగ, తురక. కులాలకు,మతాలకు ఆతీతంగా లాల్చావులనెత్తుకొని పగటిఏశాలు, మట్కీలు, మలీద, అగ్గి గుండాలతో సాగే ఆ నాటి నా పల్లె పీరీల పండుగ ఏడవాయే. సామ్రాజ్య వాద విష కౌగిలిలో మెల్లె మెల్లగా కనుమరుగవుతున్న పల్లె పరిమళలాలను రక్షించేదెవ్వరు.

    రిప్లయితొలగించండి