18, నవంబర్ 2011, శుక్రవారం

బమ్మెర పోతన ,చాకలి ఐలమ్మ గ్రామాల సందర్శన

                       


ఈ రోజు( 17 నవంబర్ 2011 న) నేను పోతన పుట్టిన బమ్మెర ,చాకలి ఐలమ్మ పుట్టిన పాలకుర్తి గ్రామాలను సందర్శించిన .వరంగల్ జిల్లాలోని పాలకుర్తి మండలం లో ఉన్నాయ్ .పోతన మాత్యుని సమాధి ,ఆయన దున్నిన మడి,అయన మోట కొట్టిన బాయి అన్నీచుసిన .చాలా అద్వాన్నంగా నిర్లక్ష్యంగా ఉన్నాయి సంస్కృతి చరిత్ర పట్ల మన పాలకులకు గౌరవం లేదు ,అక్కడి పొలాన్ని ఇప్పటికి పోతన మడి అని పిలుస్తారు '
                                 బమ్మెర పక్క ఊరే పాలకుర్తి అక్కడ తెలంగాణా సాయుధ పోరాట యోధురాలు చాకలి (చిట్యాల)ఐలమ్మ మనుమడు రామచంద్రం  బాపమ్మ జ్ఞాపకాలను చాలా సేపు చెప్పిండు .ఐలమ్మ విగ్రహం చేయించామని ఆవిష్కరణకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పిండు .ఐలమ్మ మీద సినిమా తీస్తున్న విషయం కూడా చెప్పిండు






4, ఆగస్టు 2011, గురువారం

అనువాద కవితా సంకలనం 'ఫార్మ్లాండ్ ఫ్రాగ్రన్స్' ఆవిష్కరణ విశేషేశాలు

నా అనువాద కవితా సంకలనం 'ఫార్మ్లాండ్ ఫ్రాగ్రన్స్' ఆవిష్కరణ 31 .7 . 2011 న హైదరాబాద్ లోని సిటి సెంట్రల్ లైబ్రరి లో జరిగింది .పి.జయలక్ష్మి తెలుగు నుంచి ఆంగ్లం లోకి అనువదించారు .వసంత కన్నబీరన్ పుస్తకాన్ని ఆవిష్కరించారు .నమస్తే తెలంగాణా సంపాదకులు అల్లం నారాయణ అధ్యక్షత వహించారు.తెలుగు విశ్వ విద్యాలయం మాజీ ఉప కులపతి ప్రో ,యన్.గోపి , ఆంధ్రజ్యోతి సంపాదకులు కే .శ్రీనివాస్ .సీఫెల్ విద్యాలయం ప్రో .లక్ష్మి హరిబండి,తెలంగాణా రచయితల వేదిక అధ్యక్షులు జూకంటి జగన్నాధం ,  పి.జయలక్ష్మిలు పాల్గొన్నారు .సమావేశములో అనువాదకులు ,తెలంగాణా వాదులు ,జర్నలిస్ట్లు లు ,పలువురు సాహిత్య ప్రముఖులు హాజరయ్యారు.ఈ సభను కరీంనగర్ "సాహితీ సోపతి "నిర్వహించింది .

30, జూన్ 2011, గురువారం

ఊరేగింపుల పాదముద్రలు

ఊరూరి దారుల మీద 
ఊరేగింపుల పాదముద్రలు 

వాడ వాడల అరుగుల మీద 
వేదన ఆవేదనల ఆలాపనలు 

నాలుగు బాటలు కలసిన పానాదులన్ని  
బతుకు బతుకమ్మల ఆటపాటలు

రోడ్డు బస్టాండు మూలమలుపులన్ని  
వండి వార్చిన సహపంక్తి  బోజన విస్తళ్ళు 

చెట్టూ ఆర్చి స్థంబం ఎక్కడి జెండాల్లోనైన
గుండె మ్యాపుల రెప రెపలు 

సంటి పిల్లల నుంచి 
రాలి పోయే పండు ముసలి పండ్లదాక 
మాటా ఒక్కటే ముచ్చటా ఒక్కటే 
జైకొట్టే జెండా వొక్కటే 

గాలి నేలా చెట్టు చేమా గుట్టా పిట్టా 
అస్తిత్వ ఆకాంక్షలు నినాదాలై నినదిస్తున్నై 

27, జూన్ 2011, సోమవారం

దుక్కి నిండా దుక్కం

సల సల మసిలే కన్నీళ్ళ కోనేరును 
వాదన చేసి వాదంగా నిలిపినవు.

కమ్ముకున్న కమ్మ కుట్రల రట్టు చేయగా
వేదన వదలను సిద్ధాంతం గ మలిచినవ్

పడుసు తనం నుంచి నిన్న మొన్నటిదాకా
మిడతల వలసలను కండ్లరజుసి 

పుట్టిన పీడన రడ  పుండ్లకు మల్లం రాస్తివి 
వేల వేల  ఉపన్యాసాలు వ్యాసాలు పుస్తకాలు 
ఎన్ని చేస్తివి , ఎంత తిరిగితివి , ఎంత రాస్తివి 

జయశంకర్ సార్
 తెలంగాణ మొగులు మీద సింగిడి పుసినవ్  
నీ మరణం దుక్కి నిండా దుక్క పాతం......................