8, ఆగస్టు 2010, ఆదివారం

అవును... తెలంగాణా వొక దేశమే ......

సేమంద్ర మంత్రులకేమేరుక తెలంగాణా ఒక దేశం గానే వుండేది ఆతరువాత రాష్ట్రం అయ్యిందని .పందొమ్మిది వందల నలబై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు కు ముందు హైదరాబాద్ ఒక దేశం .దీనికి ఐక్య రాజ్య సమితి లో సబ్యత్వం కూడా వుండేది. ఆ తరువాత జవహర్ లాల్ నెహ్రు, పటేల్ ల వల్ల ఇండియన్ యునియన్ ల కలిసింది.ఈ దేశానికి రాయబార కార్యాలయాలు రక్షణ ,విమాన ,రవాణా,ఆర్ధిక, వ్యవస్థలు స్వతంత్రంగా ఉండేవి. అయితే ఇది ప్రజాస్వామికమైన పరిపాలన కాదు. ఫ్యూడల్ దొరలూ, పటేండ్లు రాజ్యం అండ తో ప్రజలను పీడించే వాళ్ళు.తరువాత హైదరాబాద్ రాష్ట్రం అయ్యింది. ఆంధ్ర భాష ప్రయుక్త కుట్రలకు బలి అయి పందొమ్మిది వందల యాబై ఆరు నవంబర్ వొకటి న ఆంధ్రప్రదేశ్ అయ్యింది. ఇది షరతులతో కూడిన కలయిక అప్పటినుంచి యాబై నాలుగేళ్ళ దోపిడీ పీడన పాలన నడస్తండి.ఇదివరుకున్న రాష్ట్రం కావల్నంటే ద్రోహం దేశ ద్రోహం అని మంత్రులే ఏకసేక్కేం చేస్తుండ్రు. అయితే ఇక నుంచి ఇదివరకున్నమా దేశమే కావాలనే డిమాండు చేస్తే వస్తే ఎట్లా ఎవలకు ఎరుక ?

2 కామెంట్‌లు:

  1. MEERU CHEPPINA VISHAYAALANNI VAALLAKU TELUSU,kaakapothe vaalla swardam koddi alaa maatladatha vundaaru.

    రిప్లయితొలగించండి
  2. చరిత్ర అడక్కు. చెప్పింది విను. గిది ఆంద్ర దాదా గిరి !
    అప్పుడు తెలంగాణకు నిజాం సర్కారూ, రజాకార్లూ మోపైనట్టు -
    గిప్పుడు ఆంధ్రకార్లు మోపైండ్లు.
    ఎవడైనా తమ పెత్తనం అంత ఈజీగా వదులుకోరు.
    ఆనాడు తెలంగాణా దొరలు నిజాముకు, రజాకార్లకు మద్దతు ఇచ్చి ప్రజలకు వ్యతిరేకంగా పని చేసిండ్లు.
    ఈ నాడు గదే తెలంగాణా దొరలు రాజకీయ నాయకులై ఆంద్ర మోచేతినీళ్ళు తాక్కుంట తెలంగాణా ప్రజలకు ద్రోహం చేస్తున్నరు..
    ఆంధ్రకార్లను గాను ముందు గీ ఇంటి దొంగలను, అనాలే..
    అసలు సమస్య వీళ్ళ నాలుముచ్చుల తనంతోనే.

    రిప్లయితొలగించండి