11, జూన్ 2010, శుక్రవారం

మానుకోట కవిత

పరాష్కం ..............అన్నవరం దేవేందర్

ఎప్పుడైనా ద్రోహి ఆవలి గడ్డ వాడే కావచ్చు
దోహద కారుడు మాత్రం
ఈ గడ్డ బిడ్డడే అయితండు

పట్టా పగలు గోడలకు పొక్కలు చేయ వాడొస్తే
సుత్తె సానం ఇంతోడే అందిస్తండు

చేతికి మన్ను అంటకుండా
ఎంగిలి మెతుకులు ఏరుకున్నోడు ఎత్తి పోస్తండు

యాత్ర ఈపేరుతోనైతేనేమి
తోటలు లూటి చేయడమే మిడతల పని

పలకరింపులు వేరు పరశికలు వేరు
పరమర్శకూ పద్దతులుంటాయి

సుట్టూ మంది తుపాకులు తూటాలు ఓ బి వ్యానులు
రువ్వడి కార్లు ఫ్లేక్సిలు కయ్య కయ్య జేజేలు

గిట్ల గిర గిర తిరుగుతె సుత
మండలిచ్చే తండుకేన బిడ్డ !

యాబై ముదేన్ల వోర్పు సల్లారి పోయింది
పానం వచ్చిన కంకర కదిలి పోయింది

@@@@@@@@@@@@@


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి