25, సెప్టెంబర్ 2012, మంగళవారం
16, మార్చి 2012, శుక్రవారం
ఆదిలాబాద యాది
ఆదిలాబాద యాది
ఆయన తాన కాసేపు కుసుంటే
వూడల మర్రి కింద ఉల్లాసంగా ఉన్నట్టు
పారే గంగను సూసి బీరి పోయినట్టు
ముచాట్లన్నీ
గుట్టకు చెవు వొగ్గి వింటున్నట్టే ...
ఆయనతో ముచ్చట వెడితే
హిందుస్తానీ సంగీతం విందు చేస్తది
రుబాయి రుబాబ్ చూపిస్తడి
ఉర్దూ పర్షియన్ సాహిత్య పరిమళం
రిమ్మ తో గమ్ము మంటది
పొరలు పొరలు గా అయన జ్ఞాపకాలన్నీ
గడ్డపారతో తవ్వుతుంటే
కచ్రం కట్టుక పోయి ఎర్ర మన్ను లెక్క
ఇంటికి తెచ్చు కోవలనించే పుస్తకాలే
వినడం కోసమే
విద్య నగర్ దాక పోయిరావలె
చెవులు తెరిచి ఉంచితే చాలు
ముచ్చట సంగీతమై కడుపు నిమ్పుద్ది
ఆ ఇల్లు
సుస్వర రాగ కచేరీల చరిత్ర
అది వొక కమనీయ కావన వేదిక
కమ్మని మతాల వాటిక
ఆదిలాబాద అంటే అడవే కాదు
లేబుళ్లు:
samala sadashiva,
yaadi sadashia
18, నవంబర్ 2011, శుక్రవారం
బమ్మెర పోతన ,చాకలి ఐలమ్మ గ్రామాల సందర్శన
ఈ రోజు( 17 నవంబర్ 2011 న) నేను పోతన పుట్టిన బమ్మెర ,చాకలి ఐలమ్మ పుట్టిన పాలకుర్తి గ్రామాలను సందర్శించిన .వరంగల్ జిల్లాలోని పాలకుర్తి మండలం లో ఉన్నాయ్ .పోతన మాత్యుని సమాధి ,ఆయన దున్నిన మడి,అయన మోట కొట్టిన బాయి అన్నీచుసిన .చాలా అద్వాన్నంగా నిర్లక్ష్యంగా ఉన్నాయి సంస్కృతి చరిత్ర పట్ల మన పాలకులకు గౌరవం లేదు ,అక్కడి పొలాన్ని ఇప్పటికి పోతన మడి అని పిలుస్తారు '
బమ్మెర పక్క ఊరే పాలకుర్తి అక్కడ తెలంగాణా సాయుధ పోరాట యోధురాలు చాకలి (చిట్యాల)ఐలమ్మ మనుమడు రామచంద్రం బాపమ్మ జ్ఞాపకాలను చాలా సేపు చెప్పిండు .ఐలమ్మ విగ్రహం చేయించామని ఆవిష్కరణకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పిండు .ఐలమ్మ మీద సినిమా తీస్తున్న విషయం కూడా చెప్పిండు
26, సెప్టెంబర్ 2011, సోమవారం
4, ఆగస్టు 2011, గురువారం
అనువాద కవితా సంకలనం 'ఫార్మ్లాండ్ ఫ్రాగ్రన్స్' ఆవిష్కరణ విశేషేశాలు
నా అనువాద కవితా సంకలనం 'ఫార్మ్లాండ్ ఫ్రాగ్రన్స్' ఆవిష్కరణ 31 .7 . 2011 న హైదరాబాద్ లోని సిటి సెంట్రల్ లైబ్రరి లో జరిగింది .పి.జయలక్ష్మి తెలుగు నుంచి ఆంగ్లం లోకి అనువదించారు .వసంత కన్నబీరన్ పుస్తకాన్ని ఆవిష్కరించారు .నమస్తే తెలంగాణా సంపాదకులు అల్లం నారాయణ అధ్యక్షత వహించారు.తెలుగు విశ్వ విద్యాలయం మాజీ ఉప కులపతి ప్రో ,యన్.గోపి , ఆంధ్రజ్యోతి సంపాదకులు కే .శ్రీనివాస్ .సీఫెల్ విద్యాలయం ప్రో .లక్ష్మి హరిబండి,తెలంగాణా రచయితల వేదిక అధ్యక్షులు జూకంటి జగన్నాధం , పి.జయలక్ష్మిలు పాల్గొన్నారు .సమావేశములో అనువాదకులు ,తెలంగాణా వాదులు ,జర్నలిస్ట్లు లు ,పలువురు సాహిత్య ప్రముఖులు హాజరయ్యారు.ఈ సభను కరీంనగర్ "సాహితీ సోపతి "నిర్వహించింది .
లేబుళ్లు:
Farmland Fragrance
29, జులై 2011, శుక్రవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)








