16, మార్చి 2012, శుక్రవారం

ఆదిలాబాద యాది

ఆదిలాబాద యాది 

ఆయన తాన కాసేపు కుసుంటే 
వూడల మర్రి కింద ఉల్లాసంగా ఉన్నట్టు 
పారే గంగను సూసి బీరి పోయినట్టు 
ముచాట్లన్నీ 
గుట్టకు చెవు వొగ్గి వింటున్నట్టే ...

ఆయనతో ముచ్చట వెడితే 
హిందుస్తానీ సంగీతం విందు చేస్తది 
రుబాయి రుబాబ్ చూపిస్తడి
ఉర్దూ పర్షియన్ సాహిత్య పరిమళం 
రిమ్మ తో గమ్ము మంటది 

పొరలు పొరలు గా అయన జ్ఞాపకాలన్నీ 
గడ్డపారతో తవ్వుతుంటే 
కచ్రం కట్టుక పోయి ఎర్ర మన్ను లెక్క 
ఇంటికి తెచ్చు కోవలనించే పుస్తకాలే 

వినడం కోసమే 
విద్య నగర్ దాక పోయిరావలె 
చెవులు తెరిచి ఉంచితే చాలు 
ముచ్చట సంగీతమై కడుపు నిమ్పుద్ది 

ఆ ఇల్లు 
సుస్వర రాగ కచేరీల చరిత్ర 
అది వొక కమనీయ కావన వేదిక 
కమ్మని మతాల వాటిక 
ఆదిలాబాద అంటే అడవే కాదు 
అడవి వెన్నల ముచ్చట్ల యాది సదాశివ..