28, మే 2010, శుక్రవారం

వల్లుబండ

వల్లుబండ తెలంగాణా ఉద్యమ కవితా సంకలనం పూర్తి అయ్యింది ౧౨౦ మంది కరీంనగర్ కవుల తో మంచి పుస్తకం వస్తుంది . ముందు ఈరగోల అని పేరు అనుకున్నాం కాని జూకంటి జగన్నాధం వల్లుబండ పేరు సుచిన్చిండు .వల్లుబండ అంటే దేవాలయాల్లో వాళ్ళు చెప్పే బండ కవిత్వానికి సింబాలిక్ ఉన్నది .కవర్ పేజి శ్రీనివాస్ ఆర్ట్ వేసిండు ఇంకో , రోజుల్లో ఫైనల్ అవుతుంది

17, మే 2010, సోమవారం

దీపం వత్తి

తెల్లారిందనుకున్న తెలంగాణ కల
మల్లా తెర్లు తెర్లైంది
యాబై మూడేన్ల చెర విముక్తి ప్రకటన
ఒక్క రోజన్నా నిలువలే

తినే ఇస్తరిల మన్ను వోసిడ్రు
కాళ్ళ సందుల కట్టెవెట్టిండ్రు
మంచి నీళ్ళ బాయిల మందు కలిపిండ్రు

అడుగు పెట్టిన నేల మూలుగును
దోసుక తిన మరిగిన వాళ్ళు
డిల్లి మాటలు పార్టి జెండాలు
పాతి పెట్టి కమ్మగా ఒక్కటైండ్రు

ప్రక్రియ మొదలైందన్న పలుకులకు
గట్టిగ తాళం బిగించి
చిదంబరాన్ని సంకలేసుకున్నారు
ఇగ శ్రీకృష్ణ లీలల ఆట రక్తి కడుతది







13, మే 2010, గురువారం

తెలంగాణా ఉద్యమం మీద కరీంనగర్ కవితా సంకలనం తెస్తామని నేను నలిమెల భాస్కర్ అనుకున్నాం .ఏప్రిల్ ౨౦ నుంచి ప్రకటన విడుదల చేసి ప్రయత్నాలు మొదలు పెట్టగానే ఇప్పటికే ౯౦ వరకు కవితలు వచ్చినై . నెలాకారి వరకు పుస్తకం వస్తది .. నారాయణ శర్మ ఎడిటింగ్ లో సహకరిస్తున్నాడు .
పుస్తకం పేరు ' ఈరగోల '.......................తెలంగాణా ఉద్యమ కరీంనగర్ కవిత్వం
నూరున్నోక్క గొంతుకల గానం